ప్రముఖ నిర్మాత చేతికి ‘గూఢచారి’ హక్కులు !
Published on Jul 30, 2018 12:30 pm IST

అడివి శేష్ , శోభిత దూళిపాళ్ల జంటగా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క తెరకెక్కిస్తున్న చిత్రం’ గూఢచారి’. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది ఈచిత్రం. ఇక ఈచిత్రం యొక్క హిందీ హక్కులు 2 కోట్లకు అమ్ముడయ్యాయి. అలాగే ఈ చిత్రానికి సంభందించిన తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను రూ . 4 కోట్లకు దక్కించుకున్నారు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రై లర్లు ఇంత మంచి బిజినెస్ జరగడంలో కీలక పాత్రను పోషించాయి.

స్పై త్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుప్రియ యార్లగడ్డ ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అంధించిన ఈచిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి . మంచి అంచనాల మధ్య ఈ చిత్రం ఆగష్టు 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook