150 కోట్లను టార్గెట్ చేసిన సూర్య – సమంత

150 కోట్లను టార్గెట్ చేసిన సూర్య – సమంత

Published on Jun 22, 2014 9:58 PM IST

anjana

ప్రస్తుతం బాలీవుడ్ లో హట్ అయిన సినిమాలన్నీ 100 కోట్ల కలెక్షన్ మార్క్ క్రాస్ చేయడం చాలా రొటీన్ అయిపొయింది. అలాగే సినిమా ఇంకా సూపర్ గా ఉంటే 200 కోట్లు కలెక్ట్ చేస్తోంది. కానీ తెలుగు, తమిళ సినిమాలు మాత్రం ఇప్పుడిప్పుడే 100 కోట్ల మార్క్ దిశగా ప్రయాణిస్తున్నాయి. ముందు ముందు ఎక్కువ సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది.

ఇవన్నీ ఇలా ఉంటే ‘అంజాన్’ టీం మాత్రం ఈ సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీసు వద్ద 150 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 15న తమిళ్, తెలుగు మరియు హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

సూర్య – సమంతకి తెలుగు, తమిళ భాషల్లో ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా రెండు భాషల్లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటాయని అంటున్నారు. అలాగే సూర్య హిందీలో కూడా తన కంటూ ఓ స్మాల్ మార్కెట్ ని ఏర్పరుచుకుంటున్నాడు. కావున ఈ సినిమా 150 కోరలు కలెక్షన్స్ చేస్తుందని అంటున్నారు. లింగుస్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు