సూర్య నటించిన ‘అంజాన్’ సినిమా ట్రైలర్ సల్మాన్ ఖాన్ కిక్ వంటి వీడియోలను అధిగమించి ఇండియన్ వీడియోలలో టాప్ పొజిషన్ లో నిలిచింది. కేవలం రెండు రోజుల్లో 10 లక్షలకు పైగా హిట్ లను సొంతం చేసుకుంది.
ఈ సినిమాను తెలుగులో ‘సికిందర్’ పేరుతొ అనువదించనున్నారు. లగడపాటి శ్రీధర్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు. సూర్య మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భారీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ అయిన సమంత తెలుగులో ప్రస్తుతం టాప్ పొజిషన్ లో వుంది. కాబట్టి ఆంధ్ర, తెలంగాణాలలో ఈ సినిమా మంచి బిజినెస్ ని చేస్తుందని ఆశిస్తున్నారు.
లింగుస్వామి డైరెక్టర్. యువన్ శంకర్ రాజా సంగీతదర్శకుడు. విశేషం ఏమిటంటే ఇండియా లో టాప్ 3 పొజిషన్ లో బాహుబలి మేకింగ్ వీడియో నిలిచింది.


