‘భాగమతి’ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్న అంజలి

‘భాగమతి’ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్న అంజలి

Published on Dec 9, 2014 7:18 PM IST

Anjali1
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ అంజలి. ఆ తర్వాత తను చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈ సంవత్సరం అంజలి చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘గీతాంజలి’ పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలకే కాకుండా లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్ కి కూడా బాగా సరిపోతుందని పేరొచ్చింది. దాంతో అంజలికి మళ్ళీ వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

ఇటీవలే అంజలి మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తేలియజేశాం. ఆ సినిమాకి భాగమతి అనే టైటిల్ ని ఖరారు చేసారు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా కోసం అంజలి కోటి రూపాయల దాకా పారితోషికం తీసుకున్నట్లు అంటున్నారు. దీన్ని బట్టి సక్సెస్ ఉన్నప్పుడే నాలు రాళ్ళు వెనకేసుకోవాలనే ఫార్ములాని అంజలి బాగా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ‘పిల్లా జమిందార్’ ఫేం అశోక్ దర్శకత్వం వహిచబోయే తాజా సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తారు.

తాజా వార్తలు