గీతాంజలి 2 గా రాబోతోన్న అంజలి !

గీతాంజలి 2 గా రాబోతోన్న అంజలి !

Published on Mar 11, 2018 3:09 AM IST

హర్రర్ కామెడీ జోనర్ లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి. అలాంటి వాటిలో గీతాంజలి ఒకటి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుబ్బు అనే నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్.

కోనా వెంకట్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. అంజలి, శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాలో నటించబోతున్నారు. రాజా కిరణ్ దర్శకత్వం వహించిన గీతాంజలి కి కొనసాగింపుగా తెరకేక్కబోతున్న ఈ మూవీకి సంభందించి నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. అంజలికి గీతాంజలి సినిమా మంచి పేరు తెచ్చి పెట్టింది. అదే తరహాలో ఈ సినిమా ఉండబోతోందో చూద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు