మెగా హీరో సినిమాలో అంజలి స్పెషల్ సాంగ్

anjali-and-allu-arjun
ఈ ఏడాది S/O సత్యమూర్తి లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఆకట్టుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారి పక్కా మాస్ మసాలా సినిమాల స్పెషలిస్ట్ అయిన బోయపాటి శ్రీనుతో కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమాకి ‘సరైనోడు’ అనే టైటిల్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో ఉన్న ఓ స్పెషల్ సాంగ్ కోసం పలువురు స్టార్ హీరోయిన్ ని పరిశీలిస్తున్నారు. ఫైనల్ గా ఆ అవకాశం తెలుగమ్మాయి అంజలికి దక్కించి. అది కూడా శంకరాభరణం అనే సినిమా ద్వారా కావడం విశేషం..

అసలు విషయంలోకి వెళితే ఇటీవలే ప్రమోషన్స్ లో భాగంగా శంకరాభరణం టీం ఓ ప్రమోషనల్ సాంగ్ ని రిలీజ్ చేసింది. ఈ సాంగ్ చూసిన తర్వాత అంజలి అయితే సైరైనోడు సినిమాలోని స్పెషల్ సాంగ్ కి పర్ఫెక్ట్ అని అంజలిని అప్రోచ్ అయ్యారని, దానికి అంజలి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఈ చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంటిన్యూగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. బోయపాటి శ్రీను అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ కి సరిపోతూనే తన మార్క్ కుడా కనిపించేలా ఈ సినిమా కథని సిద్దం చేసాడట. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version