“ఆనంద భైరవి”గా అలరించనున్న అంజలి, లక్ష్మీ రాయి

Published on Jun 16, 2019 4:00 am IST

అంజలి, లక్ష్మీ రాయి ప్రధానపాత్రలో ఆదిత్ అరుణ్ ప్రత్యేక పాత్రలో కర్రీ బాలాజీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ “ఆనంద భైరవి”. హరి వేన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఇటికేల రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది.. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ అందమైన విశాఖపట్నంలో దర్శకుడు కర్రీ బాలాజీ చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి.. హాస్యనటులపై చిత్రీకరించిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి, తదుపరి షెడ్యూల్ హైద్రాబాద్లో చిత్రీకరించనున్నాం అని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ ఆనందిని పాత్రలో అంజలి ఒదిగిపోయారు, ఆ పాత్ర కోసం ఆమె చాలా కష్టపడుతున్నారు. స్కూటీ పై సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఆమెకు గాయాలు కావడం జరిగింది అయినా ఆమె వెనుకాడకుండా చక్కగా నటించారు. మణిశర్మ గారి సంగీతం మా సినిమాకు మరో పెద్ద ఆకర్షణ అవుతుంది అన్నారు. నిర్మాతల ప్రోత్సాహం తో ఇంకా బాగా కష్టపడి మంచి సినిమా తీయాలనే స్ఫూర్తి కలిగింది అన్నారు.

అంజలి ,లక్ష్మీ రాయ్ లతోపాటు, సుమన్, బ్రహ్మాజీ, మురళి శర్మ, జయప్రకాశ్ , కళ్యాణి, ఆశిష్ విద్యార్థి, పృథ్వీ, గుండు సుదర్శన్, జయవాణి, గిరి, మణిచందన, ప్రభాస్ శ్రీను,తదితరులు ఈ మూవీలో ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More