వివి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ముహూర్త కార్యక్రమాలు ఇటివలే జరిగాయి. అఖిల్ సరసన నటించబోయే హీరోయిన్ కోసం చాలా రోజుల నుండి అన్వేషణ కొనసాగుతుంది. చివరకు ఓ బాలీవుడ్ భామను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారని ఫిల్మ్ నగర్ టాక్. అధికారికంగా వెల్లడించలేదు.
ముంబై మోడల్ అమీర దస్తూర్ ని అఖిల్ సరసన హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ధనుష్ హీరోగా కెవి ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమాలో నటిస్తుంది. హిందీలో ఓ సినిమా చేసింది.
ఈ సినిమాకు వెలిగొండ శ్రీనివాస్ కథ అందిస్తునారు. కోన వెంకట్ మాటల రచయిత. శ్రేష్ఠ మూవీస్ పతాకంపై తన తండ్రితో కలసి యువహీరో నితిన్ నిర్మిస్తున్నారు. వినాయక్ శైలిలో సాగిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకేక్కిస్తున్నారట.


