వెంకటేష్ చేతుల మీదుగా ‘అనబెల్ & సేతుపతి’ ట్రైలర్ !

వెంకటేష్ చేతుల మీదుగా ‘అనబెల్ & సేతుపతి’ ట్రైలర్ !

Published on Aug 30, 2021 6:17 PM IST


మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, తాప్సీ జంటగా వస్తోన్న సినిమా ‘అనబెల్ & సేతుపతి’. దీపక్ సుందరరాజన్ ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదలైంది. ట్రైలర్ సాంతం చాలా ఆసక్తికరంగా ఉందంటూ మెచ్చుకున్నారు వెంకటేష్. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు. ఒకేసారి మూడు భాషల ట్రైలర్స్ విడుదల చేసారు మేకర్స్. తమిళంలో సూర్య.. మలయాళంలో మోహన్ లాల్ ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు.

కాగా సెప్టెంబర్ 17 హాట్ స్టార్ డిస్నీలో నేరుగా ‘అనబెల్ & సేతుపతి’ చిత్రం విడుదల కానుంది. ట్రైలర్ అంతా విజయ్ సేతుపతి, తాప్సీ చుట్టూనే తిరిగింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వెనకాల బంగ్లా ఒకటి బాగా ఫోకస్ చేశారు. పోస్టర్ ఆన్ రివర్స్ లో చూస్తే మిగిలిన నటీనటులను పరిచయం చేశారు. పోస్టర్‌లో హారర్ థ్రిల్లర్ అంశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఓటీటీలో విడుదలయ్యే సినిమాలలో ‘అనబెల్ & సేతుపతి’ కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్, యోగి బాబు, చేతన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్యాషన్ స్టూడియోస్ 8 బ్యానర్ పై సుధాన్ సుందరం, జి జయరాం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు