ఆకట్టుకునే ఫామిలీ యాక్షన్, ఎమోషనల్ అంశాలతో ‘అన్నీ మంచి శకునములే’ టీజర్

Published on Mar 4, 2023 11:03 pm IST


సంతోష్ శోభన్ హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అన్నీ మంచి శకునములే. స్వప్న సినిమా, మిత్రవిందా మూవీస్ బ్యానర్స్ పై ప్రియాంక దత్ ఎంతో గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్. గౌతమి, వెన్నెల కిషోర్, షావుకారు జానకి తదితరులు కీలక పాత్రలు చేయగా మిక్కీ జె మేయర్ దీనికి సంగీతం అందించారు. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఆకట్టుకున్న ఈ మూవీ నుండి నేడు ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

ఆహ్లాదకరమైన ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ అంశాలతో రూపొందిన ఈ టీజర్ ప్రస్తుతం ఆడియన్స్ ని అలరిస్తూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. కాగా ఈ మూవీని సమ్మర్ కానుకగా మే 18న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్ కెమెరా వర్క్ అందిస్తున్న ఈ మూవీకి లక్ష్మి భూపాల మాటలు అందిస్తున్నారు. మరి టీజర్ తో ఆడియన్స్ లో మరింత గా అంచనాలు పెంచేసిన అన్నీ మంచి శకునములే మూవీ ఎంత మేర ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :