రాశి ఖ‌న్నాకి మరో బిగ్ ఛాన్స్ !

Published on Nov 29, 2020 12:27 am IST

బబ్లీ బ్యూటీ రాశి ఖ‌న్నా టాలీవుడ్ లో చిన్న సినిమాల‌తో ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే ఫామ్ లో ఉన్న యంగ్ హీరోల స‌ర‌స‌న వ‌ర‌స‌గా అవ‌కాశాలు పొంది.. స్టార్ హీరో ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసింది. కానీ, ఆ తరువాత బిగ్ స్టార్ హీరోల స‌ర‌స‌న మాత్రం ఎందుకో అవ‌కాశాలు సంపాదించ‌లేక‌పోయింది. ఎన్టీఆర్ లాంటి హీరోతో హీరోయిన్ గా నటించినా.. ఆ సినిమాలో మ‌ల్టిపుల్ హీరోయిన్లు ఉండటంతో రాశి ఖన్నాకి సోలో హీరోయిన్ గా గుర్తింపు రాలేదు. దాంతో తెలుగులో ఏవరేజ్ రేంజ్ హీరోల‌తో మాత్ర‌మే రాశీ నటించగలిగింది.

అయితే తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు త‌గ్గుతున్నాయని అర్ధం చేసుకున్న రాశి, త‌మిళం పై ఫుల్ ఫోకస్ పెట్టి.. అక్కడ మంచి అవకాశాలనే అందుకుంటుంది. తాజాగా విక్రమ్ – హరి కలయికలో రాబోతున్న యాక్షన్ డ్రామాలో రాశి ఖన్నాకు హీరోయిన్ గా అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. దీనికితోడు గ‌త రెండేళ్ల‌లో త‌మిళంలో జ‌యం ర‌వి, విశాల్, విజ‌య్ సేతుప‌తి లాంటి హీరోలతో చెప్పుకోద‌గిన స్థాయిలోనే రాశి ఖన్నా తమిళంలో సినిమాల‌ను చేసింది. దాంతో తమిళనాట కూడా రాశి ఖ‌న్నాకి బాగానే స్టార్ డమ్ ఉంది.

సంబంధిత సమాచారం :

More