ఎన్టీఆర్ హీరోయిన్ కూడా బాలీవుడ్ భామేనా?

rrr

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరనేది ఇంకా నిర్ణయం కాలేదు. గతంలో బ్రిటిష్ హీరోయిన్ ఎడ్గర్ డేసి ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తుందంటూ వార్తలు వచ్చాయి. ఐతే కారణాలేమైనా ఆమె ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు ప్రకటించింది. దీనితో రాజమౌళి ఎన్టీఆర్ కొరకు హీరోయిన్ ని వెతుకుతూనే ఉన్నాడు. ఐతే ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కి ఇద్దరు హీరోయిన్లు కావడంతో వారిలో ఒకరిని బాలీవుడ్ హీరోయిన్ ఒకరిని ఎంపిక చేశారని సమాచారం.

ఆటవిక తెగకు చెందిన అమ్మాయి పాత్రకు గాను, బాలీవుడ్ భామతో చర్చలు జరిపి ఒకే చేశారట. ఆమె ఎవరో త్వరలోనే ప్రకటిస్తారట. బ్రిటిష్ లేడీ పాత్ర కోసం మరో హాలీవుడ్ నటిని తీసుకోవాల్సివుంది. ఇప్పటికే చరణ్ కి జంటగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన అలియా భట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమెపై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేయడం జరిగింది.

Exit mobile version