హీరోగా మరో చైల్డ్ ఆర్టిస్ట్ !

Published on Apr 19, 2019 12:00 am IST

ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ల్లో ఇప్పటికే కొంతమంది హీరోగా మరిచయమయ్యారు. ఇప్పుడు తాజాగా మరో చైల్డ్ ఆర్టిస్ట్ కూడా హీరోగా పరిచయం కాబోతున్నాడు. సినీ మహాల్, మ్యూజిక్ మ్యాజిక్, దిబెల్స్, యురేక, సినిమాల్లో నటించిన సయ్యద్ సోహెల్ (మున్నా) హీరోగా లక్కీ క్రియేషన్ బ్యానర్ లో ఓ చిత్రం ప్రారంభం కానుంది. లక్ష్మణ్ జెల్లా దర్శకత్వంలో జె.జి.మ్ లోకెష్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

హీరో మున్నా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఎనౌన్స్ చెశారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. నటీనటులు , సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియ చెస్తామని నిర్మాత లోకేష్ కుమార్ తెలిపారు. ఈ చిత్రానికి డిఓపి: రాహుల్ మాచినేని, సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, పిఆర్ఓ: సాయి సతీష్, పొస్టర్స్: ఓంకార్ కడియం.

సంబంధిత సమాచారం :