ప్రభుదేవా ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. ఈ స్టార్ కొరియోగ్రాఫర్ తాజాగా దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘యాక్షన్ జాక్సన్’ ఈ శుక్రవారం విడుదలైంది. అజయ్ దేవగన్, సొనక్షి సిన్హా, యామి గౌతమ్, మనస్వి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను విమర్శకులు చీల్చి చెండాడారు. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా పెదవి విరిచారు. అజయ్ దేవగన్ సిక్స్ ప్యాక్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులు, ముగ్గురు హీరోయిన్ల అందాలు సినిమాను కాపాడలేకపోయాయని సమాచారం.
వరుసగా ప్రభుదేవాకు ఇది రెండవ ప్లాప్. ఈ దర్శకుడి గత సినిమా ‘ఆర్.. రాజ్ కుమార్’ సైతం విమర్శకుల బాణాలకు బలైంది. ‘యాక్షన్ జాక్సన్’ కూడా అదే బాటను అనుసరించింది. ఈ రెండు సినిమాలు కూడా ప్రభుదేవా సొంత కథలు కావడం గమనార్హం. ‘యాక్షన్ జాక్సన్’ సినిమా ఫలితంతో కేవలం రీమేక్ కథలతో మాత్రమే ప్రభుదేవా హిట్స్ కొట్టగలడని విమర్శలు మొదలయ్యాయి. భారి స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ‘యాక్షన్ జాక్సన్’ మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది.


