పూజా హెగ్డేకు మరో గోల్డెన్ ఛాన్స్ దక్కనుందా ?

Published on Mar 2, 2020 9:18 pm IST

తెలుగు పరిశ్రమలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్న ఈ భామకు తెలుగునాట క్రేజీ ఆఫర్లు ఉన్నాయి. ఇలా తెలుగులో వెలిగిపోతూనే తమిళంలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటోంది పూజా. 2012లో తమిళంలో ‘ముగమూడి’ చిత్రంతో ఆరంగేట్రం చేసిన ఆమె అది వర్కవుట్ కాకపోవడంతో తెలుగుపై ఎక్కువ దృష్టి పెట్టింది.

మళ్లీ 8 ఏళ్ల తర్వాత తమిళంలోకి ప్రవేశించడానికి ఆమెకు అవకాశం దక్కేలా ఉంది. అది కూడా స్టార్ హీరో విజయ్ సినిమాతో అని టాక్. విజయ్ నెక్స్ట్ చిత్రాన్ని సుధా కొంగర డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇందులో పూజాను కథానాయకిగా తీసుకోవాలనే చర్చ జరుగుతోందట. అన్నీ కుదిరితే ఆమెకు విజయ్ సినిమాలో ఛాన్స్ దొరికినట్టే. ఇంకొద్ది రోజుల్లో ఈ విషయమై స్పష్టత రానుంది. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్, అఖిల్ సినిమాల్లో కథానాయకిగా నటిస్తోంది పూజా.

సంబంధిత సమాచారం :

More