రోజు రోజుకీ పెరుగుతున్న సంక్రాతి పోటీ !

ఈ ఏడాది సంక్రాంతి పోటీ రోజు రోజుకూ పెరుగుతోంది. మొదట్లో పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ జనవరి 10న, బాలక్రిష్ణ ‘జై సింహ’ జనవరి 12నవస్తూ ఈ రెండు చిత్రాలు మాత్రమే బరిలో ఉంటాయని అనుకోగా తమిల్ స్టార్ హీరో సూర్య నటించిన ‘గ్యాంగ్’ సినిమా జనవరి 12నే వస్తూ పోటీని కొంత పెంచగా ఇప్పుడు మరొక యంగ్ హీరో సినిమా కూడా సంక్రాంతి బరిలోకి దూకేందుకు సిద్దమయ్యాడు.

ఆయనే రాజ్ తరుణ్. చివరగా ‘అంధగాడు’ సినిమాతో మెప్పించిన ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ లో చేసిన ‘రంగుల రాట్నం’ చిత్రం సంక్రాతి విడుదలకు ఖాయమైంది. ముందుగా వస్తుందో రాదో అని అనుమానంగా ఉన్న ఈ చిత్రం తప్పక సంక్రాంతికి రిలీజవుతుందని మేకర్స్ ప్రకటించారు. శ్రీరంజని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన చిత్రా శుక్ల హీరోయిన్ గా నటించింది.

అన్నపూర్ణ స్టూడియోస్ లో ‘ఉయ్యాలా జంపాల’ తరవాత రాజ్ తరుణ్ చేసిన ప్రాజెక్ట్ ఇదే కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంది.