‘దిల్ రాజు’ నిర్మాణంలో మరో హిందీ సినిమా ?

‘దిల్ రాజు’ నిర్మాణంలో మరో హిందీ సినిమా ?

Published on Jun 29, 2019 3:00 AM IST

ఎప్పటినుండో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఇత‌ర భాషల్లో కూడా సినిమాలు నిర్మించాల‌నే కోరిక ఉంది. ఆ క్రమంలోనే మొదట శంక‌ర్‌ – క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్‌లో భార‌తీయుడు-2ను ప్లాన్ చేసినా.. అది సెట్ అవ్వలేదు. తన నిర్మాణంలో వచ్చి బ్లాక్‌ బ‌స్ట‌ర్‌ గా నిలిచిన ఎఫ్‌ 2 చిత్రాన్ని బోనీక‌పూర్‌ తో క‌లిసి హిందీలోకి రీమేక్ చేయబోతున్నాడు దిల్ రాజు.

కాగా తాజాగా జెర్సీ సినిమాను కూడా దిల్ రాజు రీమేక్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పటీకే ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ‘జెర్సీ’ యొక్క హిందీ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి దిల్ రాజు, కరణ్ జోహార్ తో కలిసి ఈ సినిమాని నిర్మించబోతున్నాడో లేక దిల్ రాజు ఒక్కడే ఈ సినిమా నిర్మిస్తాడో చూడాలి.

ఇక ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాల్లో డీసెంట్ టాక్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో ‘జెర్సీ’ ముందు వరుసలో ఉంటుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా నాని కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. అయితే ఈ రీమేక్‌ కు గౌతమ్ తిన్ననూరి స్వయంగా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. అలాగే హిందీ వెర్షన్‌ లో నాని పాత్రలో షాహిద్ కపూర్ కనిపించబోతున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు