“వీరమల్లు” కోసం మరో భారీ సెట్టింగ్..?

Published on Jun 29, 2021 7:02 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటుస్తున్న లేటెస్ట్ అండ్ భారీ పాన్ ఇండియన్ చిత్రం “హరిహర వీరమల్లు”. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎనలేని అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఒక్కో అంశాన్ని క్రిష్ ఏ లెవెల్లో తెరకెక్కిస్తున్నారో ఇది వరకే చూసాము.. అలా ఈ చిత్రంలో భారీ విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్ లు సహా సెట్టింగ్ లు కూడా ఉన్నాయని విన్నాం..

ఇప్పటికే చార్మినార్ సెట్ ను రి క్రియేట్ చేసారని తెలియగా ఇప్పుడు మరో భారీ సెట్ వేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు ఈ చిత్రంలో భారీ ఆగ్రా కోట సెట్టింగ్ ను వేస్తున్నారట.. కొన్ని కీలక సన్నివేశాల నిమిత్తం ఈ సెట్ ను వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా మొత్తంగా మాత్రం పవన్ తో క్రిష్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసారని తెలుస్తుంది.. మరి విజువల్ గా ఈ భారీ ట్రీట్ కోసం ఇంకొన్నాళ్లు ఆగక తప్పదు..

సంబంధిత సమాచారం :