“అఖండ” పై మరో ఆసక్తికర అంశం.!

Published on Jun 30, 2021 7:02 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “అఖండ”. బాలయ్య మరియు బోయపాటిల నుంచి వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ చిత్రంపై సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి.

అందుకు తగ్గట్టుగానే బోయపాటి కూడా బాలయ్యని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తున్నట్టు కూడా క్లియర్ అయ్యిపోయింది. అయితే అఖండలో ఎన్నో ఆసక్తికర అంశాలతో పాటు మరో ఆసక్తికర అంశం కూడా ఉందని తెలుస్తుంది. ఈ చిత్రంలో హిస్టారికల్ టచ్ కూడా కనపడుతుందట.

అయితే పీరియాడిక్ తరహాలో ఏమీ ఉండదు కానీ పలు చారిత్రాత్మక ప్రాంతాలలో ఈ సినిమా కనిపించనున్నట్టు తెలుస్తుంది. మరి బోయపాటి బాలయ్య ఈసారి ఎలా ప్లాన్ చేసారో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :