మరో ఆసక్తికరమైన బయోపిక్ కు రంగం సిద్ధం !

Published on Jul 15, 2018 4:17 pm IST

ఒకప్పుడు మళయాళంలో ‘షకీలా’ చిత్రం వస్తుందంటే పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఆమె చిత్రాలకు పోటీగా తమ చిత్రాలను విడుదల చేసేవారు కాదు. అలాంటి ‘షకీలా’ జీవిత కథ ఇప్పుడు సినిమాగా రాబోతుంది. నెల్లూరు జిల్లాకు చెందిన షకీలా.. సినీరంగంలోకి ఎలా వచ్చారు ? శృంగార తారగా ఎలా మారారు ?. సినీరంగంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి ? ఎంతమంది ఆమెను మోసం చేశారు ? ఇలాంటి పలు ఆసక్తికరమైన విషయాలను ఆమె బయోపిక్ లో చూపించనున్నారు.

ప్రస్తుతం షకీలా తెలుగు, తమిళ చిత్రాల్లో చిన్న చిన్న కారెక్టర్స్ కూడా చేస్తున్నారు. అలాగే ఆమె ప్రధాన పాత్రగా త్వరలో శీలవతి చిత్రం విడుదల కానుంది. ఐతే సినీవర్గాల సమాచారం ప్రకారం షకీలా బయోపిక్ ను మలయాళంలో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా షకీలా పాత్రలో బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా కనుపించనుంది. ఈ చిత్రం కోసమే రిచా చద్దా ప్రత్యేకంగా మ‌ల‌యాళం నేర్చుకొన్నే పనిలో ఉంది. అదేవిధంగా ష‌కీలాతో మాట్లాడి ఆమె వ్యక్తిగత జీవితం గురించి, ఆమె బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకుంటుంది. హిందీ, మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానున్న ఈ చిత్రం ఆగస్టు నుండి షూటింగ్ ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం :

X
More