ప్రభాస్ – నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ పై మరో ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on May 30, 2021 2:13 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమాల్లో పాన్ ఇండియన్ చిత్రాలతో పాటుగా ఒక పాన్ వరల్డ్ చిత్రం కూడా తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేసిన ఈ చిత్రం ప్రపంచ స్థాయి సినిమాగా తెరకెక్కనుంది. లేటెస్ట్ ఊహాగానాల ప్రకారం భవిష్యత్తు కాలంలో కనిపించబోయే ఈ హై ఎండ్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామాపై మరిన్ని ఆసక్తిగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఇది వరకే ఈ చిత్రంలో భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నరని తెలిసింది. అయితే ఇప్పుడు మరో బజ్ ప్రకారం ఈ చిత్రంలో ఓ ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటుడు విలన్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. అలాగే మరింత మంది బాలీవుడ్ నటులకి ఈ చిత్రంలో స్కోప్ ఉందని మరో గాసిప్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో ఆల్రెడీ బాలీవుడ్ స్టార్ నటులు దీపికా పదుకొనె మరియు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :