శంకర్ – చరణ్ ప్రాజెక్ట్ పై మరో స్ట్రాంగ్ బజ్.!

Published on Mar 23, 2021 5:16 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ రామ్ చరణ్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కాంబోలో ఓ చిత్రాన్ని ఇటీవలే అనౌన్సమెంట్ చెయ్యడంతో ఎంతటి హైప్ వచ్చిందో తెలిసిందే. మరి అలాగే ఈ భారీ చిత్రం అనౌన్సమెంట్ అనంతరం అనేక రకాల గాసిప్స్ కూడా చక్కర్లు కొట్టాయి. ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్లో కాకుండా పాన్ ఆసియన్ లెవెల్లో ఉంటుంది అని కొరియన్ నటి బే సూజి చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది అని గాసిప్స్ వచ్చాయి.

మరి వీటితో పాటుగా హీరోయిన్ విషయంలో మరిన్ని పేర్లు కూడా వినిపించాయి. కానీ లేటెస్ట్ స్ట్రాంగ్ బజ్ ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ పేరే ముందు వరుసలో ఉందట. సో ఆల్ మోస్ట్ ఈమెనే ఫిక్స్ కావచ్చు. మరి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా ఇంకా చర్చలు కొనసాగుతున్నాయట. శంకర్ – చరణ్ తో పాటుగా నిర్మాత దిల్ రాజుకి కూడా బెంచ్ మార్క్ చిత్రం అయినటువంటి దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించనున్నారు.

సంబంధిత సమాచారం :