ప్రభాస్ మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ గాసిప్.!

Published on May 31, 2021 12:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియన్ సినిమాలు సహా పాన్ వరల్డ్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి వీటిలో ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆదిపురుష్”. బాలీవుడ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ తో ప్లాన్ చేసిన ఈ భారీ చిత్రం హిందీ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది.

అలాగే మిగతా ఇతర భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా కాకుండా ప్రభాస్ మరో బాలీవుడ్ దర్శకుడితో సినిమా చేయనున్నాడని ఎప్పటి నుంచో సాలిడ్ బజ్ ఉంది. అదే అక్కడి భారీ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిద్దార్థ్ ఆనంద్ తో.. ఈ కాంబోలో సినిమా ఉందని ఎప్పటి నుంచో టాక్ ఉంది.

ఇపుడు దానిపైనే మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక ‘రా ఏజెంట్’ గా కనిపించనున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకా ఈ కాంబోలో సినిమా ఉందో లేదో ఫిక్స్ కాలేదు కానీ ఈ గాసిప్స్ మాత్రం ఎక్కువే స్ప్రెడ్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :