మరో ఇంట్రెస్టింగ్ మ్యాగజైన్ ను రిలీజ్ చేసిన “కేజీయఫ్ 2” మేకర్స్.!

Published on Jan 10, 2021 6:00 pm IST

లేటెస్ట్ సెన్సేషన్ “కేజీయఫ్ చాప్టర్ 2” కోసం ఓవరాల్ ఇండియా వైడ్ ప్రేక్షకులకు కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. టీజర్ తో కనీ వినీ ఎరుగని స్థాయి రికార్డులను కొల్లగొట్టిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు నమోదు చెయ్యడం ఖాయం అని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు ఫిక్స్ అయ్యిపోయాయి. మరి ఇవన్నీ జరగాలి అంటే చాప్టర్ 2 లో మరింత స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి.

మరి అది ఎలా ఉంటుంది అన్నదానిపై మేకర్స్ నుంచి మ్యాగజైన్ రూపేణా హింట్స్ ఇస్తున్నారు. అలా లేటెస్ట్ గా వచ్చిన మరో మ్యాగజైన్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కనిపిస్తుంది. కేజీయఫ్ చాప్టర్ 2 ఎలా ముగుస్తుంది? దేశం తెలుసుకోవాలనుకుంటుంది అని హైలైట్ చేశారు. అలాగే ఓ స్టాంప్ లా నారాచి గేట్లు బద్దలు కొట్టబడ్డాయి అని కూడా ఉంది.

మరి ఇవన్నీ చూస్తూ ఉంటే రాకీ భాయ్ తన ప్రస్థానాన్ని నెలకొల్పే సమయంలో తన సైన్యంతో నరాచి గేట్లు బద్దలు కొట్టడం ఖాయమే అనిపిస్తుంది. అలాగే అక్కడ నుంచి రాకీ దేశ రాజకీయాల్లోనే తన పవర్ ను ఎలా చూపించాడు అన్నదే ఈ మ్యాగజైన్ ద్వారా అర్ధం అవుతుంది. మరి ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో కథను ఎలా మలుపు తిప్పుతాడు అన్నది అంతకంతకూ ఆసక్తి రేపుతోంది. అది ఎలా ఉంటుంది అన్నది సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలి.

సంబంధిత సమాచారం :