“ఆచార్య” పై మరో ఇంట్రెస్టింగ్ టాక్.!

Published on Apr 3, 2021 11:07 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ చిత్రం “ఆచార్య” భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రంకు ఒక్కో పార్ట్ వారీగా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా చరణ్ నటిస్తున్నాడన్న అంశంతో పాటుగా చిరు మరియు మణిశర్మల మ్యాజికల్ కాంబో మళ్ళీ రిపీట్ అనేసరికి దానిపై కూడా సెపరేట్ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కాంబో పైనే లేటెస్ట్ టాక్ బయటకు వచ్చింది..

ఇటీవలే సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఏ మధ్యనే విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ “లాహే లాహే” లానే మిగతా అన్ని పాటలు కూడా అంతకు మించే ఉంటాయని ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే మిగతా సాంగ్స్ అన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి అన్నది చెప్పడానికి ఉదాహరణ లాంటిది అని వెల్లడించారు. దీనిని బట్టి ఈ చిత్రంతో మళ్ళీ చిరు మరియు మణిశర్మల సెన్సేషనల్ కాంబో మళ్ళీ గట్టిగానే కొట్టేలా ఉన్నాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం :