ఇంట్రెస్టింగ్..”అమృతం” సీరియల్ కి మరో టైటిల్స్ అట.!

Published on May 6, 2023 3:01 pm IST

తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర ఉన్నటువంటి ఆల్ టైం ఎవర్ గ్రీన్ సీరియల్స్ లో 90ల ఆడియెన్స్ లో చెరగని ముద్ర వేసుకున్న సీరియల్ “అమృతం” కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో రొటీన్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాల మధ్య ఓ బ్యూటిఫుల్ రిలీఫ్ లాగ వచ్చిన ఈ సీరియల్ దాదాపు దశాబ్ద కాలం స్వచ్ఛమైన ఎంటర్టైన్మెంట్ ని అందించింది.

అయితే ఈ సీరియల్ విషయంలో లేటెస్ట్ గా మేకర్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ లు మేకింగ్ కోసం పంచుకున్నారు. మరి దర్శకుడు గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ అసలు “అమృతం” సీరియల్ అనుకున్నపుడు మొదట ఈ టైటిల్ ప్రస్తావనలో లేదని అప్పట్లో ఓ రైటర్ “మీకు మీరే మాకు మేమే”, “ఇది ఇదే అది అదే” టైటిల్స్ అనుకున్నారట. కానీ ఇవి చప్పగా ఉన్నాయని తర్వాత అమృతం టైటిల్ పెట్టామని తెలిపారు.

సంబంధిత సమాచారం :