“RRR” ఓటిటి వెర్షన్ పై మరో కీలక బజ్.!

ప్రస్తుతం మన ఇండియన్ సినిమా దగ్గర ఉన్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో కలిపి దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. బాహుబలి చిత్రాల తర్వాత దేశ వ్యాప్తంగా మళ్ళీ దానికి మించిన క్రేజ్ తెలుగు సినిమా తెచ్చింది అంటే అది ఇదే అని చెప్పాలి.

మరి ఈ చిత్రానికి సంబంధించిన ఓటిటి మరియు శాటిలైట్ అప్డేట్ నిన్ననే బయటకు వచ్చింది. ఆ హక్కులను కొనుగోలు చేసిన పెన్ స్టూడియోస్ వారు స్వయంగా ప్రకటించారు. మరి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. ఈ భారీ చిత్రాన్ని అక్టోబర్ 13 కే ఎట్టి పరిస్థితుల్లోని తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ అయ్యి ఉన్నారు.

మరి అదే సమయానికి ఈ చిత్రం విడుదల అయితే ఓటిటిలో ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది మరో ఆసక్తికర పాయింట్ గా మారింది. మరి తాజా బజ్ ప్రకారం ఈ చిత్రం ఓటిటిలో థియేట్రికల్ గా విడుదల కాబడిన పది పదకొండు వారాల తర్వాతనే అందుబాటులోకి వస్తుంది అని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి అన్ని సహకరించి ఈ భారీ చిత్రం అతి త్వరలో ఇండియన్ ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం.

Exit mobile version