“RRR” షూట్ పై మరో లేటెస్ట్ అప్డేట్.!

“RRR” షూట్ పై మరో లేటెస్ట్ అప్డేట్.!

Published on Jun 22, 2021 10:01 AM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని అనుకున్న సమయం కంటే ముందే నిన్నటి నుంచే జక్కన్న స్టార్ట్ చేసేసారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంలో నిన్ననే రామ్ చరణ్ షూట్ లో పాల్గొన్నాడని తెలిసింది.

మరి ఇప్పుడు తారక్ జాయినింగ్ పై అప్డేట్ తెలుస్తుంది. అయితే తారక్ మాత్రం ఈ రోజు నుంచి కానీ ఈ వారంలోనే షూట్ లో జాయిన్ కానున్నట్టు తెలుస్తుంది. మరి అలాగే ప్రస్తుతం వీరిద్దరి మధ్య అదిరే సాంగ్ షూట్ ను మేకర్స్ చేస్తున్నారని తెలిసిందే. ఇక ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్ లు కూడా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే డివివి దానయ్య నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు