“RRR” నుంచి మరో లీక్..మేకర్స్ ఇంకా కేర్ తీసుకోవాలి.!

“RRR” నుంచి మరో లీక్..మేకర్స్ ఇంకా కేర్ తీసుకోవాలి.!

Published on Jan 27, 2021 9:01 AM IST

మన టాలీవుడ్ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ పీరియాడిక్ చిత్రం ఎప్పుడు విడుదల కానుందో కూడా మేకర్స్ ఇటీవలే కన్ఫర్మ్ చేసేసారు. అయితే రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు లీకుల బెదడలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. మరి అలాగే ఈ భారీ చిత్రానికి కూడా స్టార్టింగ్ లోనే లీకుల సెగ తగిలింది.

కానీ ఆ తర్వాత చాలా కాలం పాటే దానికి అడ్డుకట్ట వేసేసారు. కానీ ఇప్పుడు మళ్ళీ మరో లీక్ సెగ మేకర్స్ కు తగిలింది. దీనితో దానికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే రచ్చ లేస్తుంది. ఆ టాక్ ప్రకారం చరణ్ మరియు తారక్ ల నడుమ ఓ అదిరిపోయే యాక్షన్ బ్లాక్ కు సంబంధించి ఫోటో లీక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దానిని కాస్తా అభిమానులే జోరుగా ప్రచారం చేసుకుంటుండడం గమనార్హం.

అయితే కొంతమంది భాద్యతాయుతమైన కొంతమంది అభిమానులు మాత్రం అందుకు విరుద్ధం గానే ఉన్నారు. మరి ఈ లీక్స్ విషయంలో మాత్రం మేకర్స్ ఖచ్చితంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఎన్నో సినిమాలు లీక్ అయ్యిపోయిన వార్తలు చూసాము. మరి ఎంతో కస్టపడి తీస్తున్న ఈ సినిమాను జక్కన ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు