“వీరమల్లు”లో మరో స్థాయి యాక్షన్ సీక్వెన్సెస్..?

Published on Jun 5, 2021 2:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ బడ్జెట్ అండ్ ఫస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు”. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన గ్లింప్స్ కానీ బయటకి వచ్చిన పవన్ వర్క్ స్టిల్స్ కానీ మరింత హైప్ ను ఈ చిత్రంపై తీసుకొచ్చాయి.

ముఖ్యంగా ఈ చిత్రంలో పవన్ నుంచి సాలిడ్ యాక్షన్ ను మనం చూడొచ్చని మేకర్స్ క్లియర్ చేసేసారు. అయితే ఇప్పుడు బజ్ ప్రకారం ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్సెస్ ను క్రిష్ ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని బజ్ వినిపిస్తుంది. ఇప్పటికే వి ఎఫ్ ఎక్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటాయని తెలిసింది. మరి ఇలాంటి పీరియాడిక్ చిత్రంలో పవన్ కి తగ్గట్టుగా ఆ యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉండనున్నాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :