మహా శివరాత్రికి మరో మెగా ట్రీట్ ఉందా.?

మహా శివరాత్రికి మరో మెగా ట్రీట్ ఉందా.?

Published on Mar 6, 2021 11:42 PM IST


మన టాలీవుడ్ లో పండుగ వాతావరణం వస్తుంది అంటే చాలు సరికొత్త సినిమాలు అలాగే సరికొత్త అప్డేట్స్ తో మరింత సందడి నెలకొంటుంది. మరి అలా ఈ మహా శివరాత్రి సందర్భంగా అదిరిపోయే అప్డేట్సే రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ కాంబోలలో తెరకెక్కతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ లు విడుదల కావడానికి సిద్ధంగా ఉండగా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు మరో సాలిడ్ ట్రీట్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

ఇదే శివరాత్రి కానుకగా మెగాస్టార్ చిరంజీవి మరియు బ్లాక్ బస్టర్ కొరటాల శివ సహా మణిశర్మ ల సెన్సేషనల్ కాంబో “ఆచార్య” నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందట. అందుకు ఆల్రెడీ సన్నాహాలు జరుగుతుండగా టాక్ కూడా మొదలయ్యింది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా కాజల్ మరియు పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతుంది.

తాజా వార్తలు