ఆర్య సార్పట్టా చిత్రం కూడా ఓటిటి లో కి రానుందా?

Published on Jun 29, 2021 7:53 pm IST


థియేటర్లు ఇంకా తెరుచుకోకపోవడం తో కొందరు ఓటిటి వైపుకి మొగ్గు చూపుతున్నారు. అయితే అదే కోవలో ఆర్య నటించిన సార్పట్టా చిత్రం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సార్పట్టా పరంబరై చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం జీ 5 లో డైరెక్ట్ ఓటిటి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం లో ఆర్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

సార్పట్టా చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తుండగా, సంతోష నారాయణన్ సినిమా కి సంగీతం అందిస్తున్నారు. అయితే ఇప్పటికే శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ను జీ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :