ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ లకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. దర్శకులు, నిర్మాతలు ప్రముఖ వ్యక్తుల జీవితాలను బయోపిక్స్ రూపంలో తెరకెక్కించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే నందమూరి తారకరామారావుగారి జీవితం ఆధారంగా క్రిష్, బాలక్రిష్ణలు కలిసి ‘ఎన్టీఆర్’ పేరుతో, దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత గాథను మహి వి రాఘవ్, మమ్ముట్టిలు ‘యాత్ర’ పేరుతో రూపొందిస్తుండగా తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారధి కేసీఆర్ బయోపిక్ ను కూడా రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే కత్తి కాంతారావు, పుల్లల గోపీచంద్ బయోపిక్ లు కూడా తెరకెక్కబోతున్నాయి.
కాగా తాజాగా మరో బయోపిక్ కూడా తెరకెక్కబోతుంది. ఒకప్పటి తెలుగు హీరో, ఇప్పటి బహుభాషా నటుడైన జగపతిబాబు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుపుకుంటోందట.ఈ బయోపిక్‌కు ‘సముద్రం’ అనే పేరును పెట్టారు చిత్రబృందం. ఐతే ఇది సినిమాలా కాకుండా ఎంటనర్టైన్మెంట్ ఛానల్ లో ఒక 25 ఎపిసోడ్స్ వైజ్ గా రానుంది. ఈ బయోపిక్ గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.


