“కేజీయఫ్ 2” టీజర్ మరో సెన్సేషనల్ ఫీట్.!

Published on Feb 28, 2021 10:50 am IST

ఇప్పుడు ఇండియన్ వైడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లుగా ఉన్న వాటిలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. చాప్టర్ 1 కన్నా తారా స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి గత నెల వచ్చిన మోస్ట్ అవైటెడ్ టీజర్ కు అయితే ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానే ఏ సినిమాకూ ఇవ్వని స్థాయి రెస్పాన్స్ ను ఇచ్చారు.

అది లైక్స్ కానీ వ్యూస్ కానీ కనీ వినీ ఎరుగని రీతి రికార్డులనే ఈ టీజర్ సెట్ చేసింది. అలా ఇప్పుడు మరో సెన్సేషనల్ మైల్ స్టోన్ ను ఈ టీజర్ అందుకుంది. రీసెంట్ గా 8 మిలియన్ మార్క్ లైక్స్ అందుకొని వరల్డ్స్ ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ 8 మిలియన్ లైక్స్ కలిగిన టీజర్ గా నిలిచింది. మొత్తానికి మాత్రం ఈ టీజర్ సెన్సేషన్ గట్టిగానే ఉందని చెప్పాలి. మరి సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూలై 16న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :