మరో సాలిడ్ ప్రాజెక్ట్ లైన్లో పెడుతున్న వైష్ణవ్.?

మరో సాలిడ్ ప్రాజెక్ట్ లైన్లో పెడుతున్న వైష్ణవ్.?

Published on Mar 17, 2021 7:35 PM IST


అసలు మన టాలీవుడ్ లోనే కాకుండా ఏ సినీ ఇండస్ట్రీలో కూడా ఏ హీరోకి రాణి డెబ్యూ హిట్ పంజా వైష్ణవ్ తేజ్ అందుకున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో “ఉప్పెన” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా హీరో తన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకోడమే కాకుండా 100 కోట్ల మార్క్ ను కూడా అందుకొని సెన్సేషన్ ను నమోదు చేసాడు.

ఇక ఈ చిత్రం ఇంకా విడుదల కాక ముందే విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఒక క్విక్ ప్రాజెక్ట్ ను కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏమిటంటే లేటెస్ట్ సెన్సేషన్ “జాతి రత్నాలు” డైరెక్టర్ తో వైష్ణవ్ ఓ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇటీవల అనుదీప్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఒక మార్షల్ ఆర్ట్స్ అండ్ కామెడీతో కూడిన సినిమా ఉంటుంది అని చెప్పాడు. మరి బహుశా అదే సినిమా ఉంటుందా లేక వేరే ప్రాజెక్టా అన్నది చూడాలి. మొత్తానికి మాత్రం వైష్ణవ్ కూడా మంచి లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడని చెప్పాలి.

తాజా వార్తలు