బాక్సాఫీస్ వద్ద సాలిడ్ రెస్పాన్స్ తో “బలగం”

Published on Mar 19, 2023 11:37 pm IST


ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు పెరిగిన తర్వాత ఇటీవల సినిమాలు థియేటర్ల లో లాంగ్ రన్ అంటే చాలా అరుదైన విషయం. అందులో చిన్న బడ్జెట్ చిత్రాలకు థియేట్రికల్ రన్‌ను పొడిగించడం మరింత కష్టం. కానీ బలగం మాత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అలసత్వం చూపడం లేదు, అంతేకాక ముఖ్యంగా నైజాం ఏరియా లో ఈ సినిమా డ్రీమ్ రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ రెస్పాన్స్ ను బలగం దూసుకు పోతుంది.

కమెడియన్, నటుడు అయిన వేణు యెల్దండి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి మరియు కావ్య కళ్యాణ్‌ రామ్ లు ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో రాక్ సాలిడ్ వీకెండ్‌ను కలిగి ఉంది. కొత్త విడుదలలు మిశ్రమ స్పందనలను పొందడంతో, బలగం సినిమా ప్రేక్షకుల మొదటి ఎంపికగా మిగిలిపోయింది. బలగం చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ధమాకా ఫేమ్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు. వేణు యెల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచ్చ రవి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం :