‘ప్రస్థానం’ హిందీ రీమేక్లో మరొక స్టార్ నటుడు !

‘ప్రస్థానం’ హిందీ రీమేక్లో మరొక స్టార్ నటుడు !

Published on Jun 5, 2018 12:58 PM IST

శర్వానంద్, సాయి కుమార్, సందీప్ కిషన్ లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు దేవ కట్ట రూపొందించిన చిత్రం ‘ప్రస్థానం’. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటీకే షూటింగ్ కూడ మొదలైంది. సంజయ్ దత్, యువ హీరో అలీ ఫజల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో అమైరా దస్తూర్ కథానాయకిగా నటిస్తోంది.

అంతేగాక ఈ సినిమాలో మనీషా కొయిరాల ఒక కీలక పాత్ర చేస్తుండగా ఇప్పుడు మరొక స్టార్ నటుడు జాకీర్ ష్రాఫ్ కూడ ఈ చిత్రంలో ఇంకొక ముఖ్య పాత్రను చేయనున్నారు. సంజయ్ దత్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు. మరి తెలుగులో అంతటి విజయాన్ని అందుకున్న ఈ సినిమా హిందీలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు