‘శాకుంతలం’లో మరో స్టార్ హీరో ?

Published on Mar 16, 2021 5:07 pm IST

భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్, సమంత అక్కినేని టైటిల్ రోల్ తో ప్రస్తుతం చేస్తోన్న ‘శాకుంతలం’ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే చాల నెలల నిరీక్షణ తరువాత గుణశేఖర్ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమా ఇద్దరు ప్రేమికుల అందమైన దృశ్య కావ్యం అంటున్నాడు గుణశేఖర్. నాటి శాకుంతల-దుష్యంతుల ప్రేమకావ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమాలో మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే మోహన్ లాల్ ది ఏ పాత్ర అనేది ఇంకా క్లారిటీ లేదు. మరి కొన్నాళ్ళు ఆగితే గాని ఈ వార్త పై స్పష్టత రాదు. ఇక ఈ సినిమాకి మాటలు సాయి మాధవ్ బుర్రా అందించాడు. సమంత ప్రధాన పాత్రగా ఈ భారీ పౌరాణికం మూవీ రాబోతుంది కాబట్టి.. ఈ చిత్రంలో విఎఫ్‌ఎక్స్‌ వర్క్ అధికంగా ఉంటుందట. అలాగే పర్ఫెక్షన్, క్వాలిటీ కోసం టీమ్ ఈ సాంకేతికతను వాడుతున్నారట. ఇక రాజకుమార్తెగా నటించడం.. అది తన కల అని చెప్పింది సమంత.

సంబంధిత సమాచారం :