బాలయ్యతో స్టెప్స్ వేసిన మరో స్టార్ హీరోయిన్ !

బాలయ్యతో స్టెప్స్ వేసిన మరో స్టార్ హీరోయిన్ !

Published on Nov 17, 2018 2:30 AM IST

నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో.. ఆయన తండ్రి ‘నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్నారు. నిడివి చాలా తక్కువ ఉన్న పాత్రల్లో కూడా.. భారీ తారాగణం నటిస్తోంది.

కాగా, గత రెండు రోజులు నుండి దానవీరశూరకర్ణ సినిమాలోని ‘చిత్రం భళారే విచిత్రం’ పాటను దుర్యోధనుడు గెటప్ లో ఉన్న బాలయ్య పై చిత్రీకరించారు. కాగా ఈ పాటలో బాలయ్య సరసన శ్రీయా శరణ్ కూడా నటించింది. పాటలో బాలయ్యతో కలిసి ఆమె స్టెప్స్ కూడా వేసినట్లు తెలుస్తోంది.

కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను జనవరి 9న విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు