“సర్కారు వారి పాట”పై మరో హైలైటింగ్ బజ్.?

మొత్తం మూడు భారీ బ్లాక్ బస్టర్ల అనంతరం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించనున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ లు మరిన్ని అంచనాలు పెంచుతున్నాయి.

వాటిలో ఈ సినిమాను పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా విడుదల చేసే యోచనలో ఉన్నారన్నది ఒకటైతే ఇప్పుడు మరో బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాలో పరశురామ్ ఒక స్పెషల్ అండ్ పవర్ ఫుల్ రోల్ ను కూడా డిజైన్ చేస్తున్నారట. అందుకు తగ్గట్టుగానే ఈరోల్ కు ఒక పేరు మోసిన సీనియర్ నటుణ్ణే ఎన్నుకొనే సూచనలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు అనీల్ కపూర్ విలన్ రోల్ లో కనిపించే అవకాశాలు ఉన్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అతను కాకుండానే మరో కీలక రోల్ ఈ చిత్రం ఉండనుంది అని ఈ బజ్ ద్వారా తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version