కేరళకు మరో తమిళ హీరో అత్యధిక విరాళం !

Published on Aug 23, 2018 9:48 am IST

వరదల తో అతలాకుతలమైన కేరళలో ఇప్పుడిప్పుడే కొంచెం పరిస్థితి మెరుగుపడుతుంది. వరదలు తగ్గుముఖం పట్టడంతో సహాయక శిబిరాలనుండి ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇక వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు విరాళాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ కేరళలో వున్న ఆయన అభిమాన సంఘాలతో కలిసి 70లక్షలు రూపాయలను విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు మరో తమిళ హీరో, దర్శకుడు. కొరియోగ్రాఫర్ , లారెన్స్ ఏకంగా కోటి రూపాయాలను వరద బాధితుల సహాయార్థం ప్రకటించారు. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీ నుండి ఇదే అత్యధిక విరాళం. ఇక లారెన్స్ ఈ శనివారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిసి కోటి రుపాయాలను స్వయంగా అందజేయనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More