ఇప్పుడు “వకీల్ సాబ్” టీజర్ తో టార్గెట్.!

Published on Apr 1, 2021 9:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. అసలు హైప్ నే లేదు అనుకున్న సినిమా నుంచి మాస్ ఓపెనింగ్స్ కన్ఫర్మ్ అనే స్థాయికి మేకర్స్ దీనిని ఇప్పుడు సెట్ చేసేసారు. మరి ఇదిలా ఉండగా ఇటీవల వచ్చిన ట్రైలర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

24 గంటల్లో వ్యూస్ మరియు లైక్స్ పరంగా నయా రికార్డులు సెట్ చేసింది. అంతే కాకుండా మరోపక్క దర్శకుడు శ్రీరామ్ వేణు కూడా ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ట్రైలర్ తో సెట్ చేసిన మాసివ్ ఫీట్ ను టీజర్ తో కూడా సెట్ చెయ్యాలని చూస్తున్నారు.

ట్రైలర్ కు ఫస్ట్ ఎవర్ 1 మిలియన్ వ్యూస్ సాధించిన టాలీవుడ్ ట్రైలర్ గా రికార్డు సెట్ చెయ్యగా టీజర్ కు ఆల్రెడీ 9 లక్షలు లైక్స్ దాటడంతో దీనికి కూడా 1 మిలియన్ లైక్స్ సెట్ చేసి పవన్ పేరిట రెండు 1 మిలియన్ లైక్డ్ వీడియోస్ ఉండాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఇదెప్పుడు అవుతుందో చూడాలి.

ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా నివేతా థామస్, అంజలి మరియు అనన్య నాగళ్ళలు కీలక పాత్రలో నటించారు. అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే ఏప్రిల్ 9న గ్రాండ్ రిలీజ్ కు రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :