తారక్ నటించిన మరో చిత్రం కోలీవుడ్ కు వెళ్లనుంది !

తారక్ నటించిన మరో చిత్రం కోలీవుడ్ కు వెళ్లనుంది !

Published on Aug 28, 2018 12:40 PM IST

NTR7

టాలీవుడ్ హిట్ చిత్రాలు కోలీవుడ్ కి క్యూ కడుతున్నాయి. ఇక్కడ హిట్టైన చిత్రాలను తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ చిత్రం తమిళ భాషలో రీమేక్ అవుతుంది. శింబు హీరోగా నటించనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘టెంపర్’ చిత్రాన్ని విశాల్ రీమేక్ చేస్తున్నాడు. అక్కడ ఈచిత్రం ‘అయోగ్య’ పెరుతో రీమేక్ అవుతుంది. ఈచిత్రం ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

ఇక ఇప్పుడు మరో తెలుగు సూపర్ హిట్ చిత్రం తమిళంలోకి వెళ్లనుంది. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని కోలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. ఈచిత్రంలో తమిళ స్టార్ హీరో నటించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించిన వివరాలను ప్రకటించనున్నారు.

తాజా వార్తలు