ఉమామహేశ్వర డైరెక్టర్ గా ఓ టి టి కి వచ్చేశాడు.

Published on Jun 6, 2020 5:36 pm IST

హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య మూవీని కూడా మేకర్స్ ఓ టి టి లో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు వారు ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ మూవీ ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది. మరో రెండు నెలలు థియేటర్స్ తెరుచుకునే సూచనలు లేవు. దీనితో ఓ టి టి లో అగ్రగామిగా ఉన్న నెట్ ఫ్లిక్స్ ఈ హక్కులను దక్కించుకుంది.

ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య మూవీని ఓ టి టి విడుదల చేయనున్నారనే న్యూస్ నిన్ననే బయటికి రాగా నేడు దానిపై అధికారిక ప్రకటన వచ్చింది. ఐతే ఈ చిత్రం ఆహా లో అందుబాటులోకి రానుందని అని ప్రచారం జరిగింది. కానీ నెట్ ఫ్లిక్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఫ్యాన్సీ ధర చెల్లించి దక్కించుకున్నట్లు తెలుస్తుంది. మలయాళ హిట్ మూవీకి రీమేక్ వచ్చిన ఈ చిత్రానికి కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :

More