“వకీల్ సాబ్” కి ముందుగా అనుకున్న టైటిల్ ఇదే.!

Published on Mar 21, 2021 1:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “వకీల్ సాబ్”. మూడేళ్లకు పైగా సుదీర్ఘ విరామం అనంతరం పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి.

అలా లేటెస్ట్ గా దర్శకుడు వేణు శ్రీరామ్, సంగీత దర్శకుడు థమన్ అలాగే సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రిలు ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలనే తెలిపారు. అందులో ఈ సినిమా టైటిల్ పై మాట్లాడుతూ తాము ముందు “వకీల్ సాబ్” టైటిల్ అనుకోలేదని సినిమా కథకు తగ్గట్టుగా “మగువ” అని అనుకున్నామని తెలిపారు.

అలాగే ఇదే టైటిల్ తో వచ్చిన సాంగ్ ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. కానీ తర్వాత మళ్లీ పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా “వకీల్ సాబ్” ను పెట్టామని తెలిపారు. అలాగే ఈ చిత్రంలో పవన్ చేసే రోల్ పేరు సత్యదేవ్ అని కూడా రివీల్ చేశారు. ఇలా మొత్తానికి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలనే ఇందులో పంచుకున్నారు.

సంబంధిత సమాచారం :