“పుష్ప” నుంచి ఈసారి రెండు లీక్స్..?

Published on Mar 25, 2021 9:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న బార్ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం శరవేగంగా షూట్ ను జరుపుకుంటుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం షూట్ మొదలు పెట్టిన నాటి నుంచే లీక్స్ కూడా మొదలయ్యాయి. పలు యాక్షన్ సీక్వెన్స్ లు నుంచి ఆన్ సెట్స్ వీడియోలు చాలానే ఆ మధ్య బయటకు వచ్చేసాయి.

కానీ ఇప్పుడు ఇదే చిత్రం నుంచి మరో రెండు లీక్స్ వచ్చినట్టుగా సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఒకటేమో బన్నీ రష్మికా ల మధ్య సాంగ్ కాగా మరొకటి రష్మికాపై ఆన్ లొకేషన్ వీడియో వీటిలో సాంగ్ కోసం అయితే అభిమానులే జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు తప్పితే లీక్స్ కోసం చింతిస్తున్న దాఖలాలు లేవు. మరి మేకర్స్ ఈ లీక్స్ పట్ల స్ట్రిక్ట్ గా ఎందుకు ఉండట్లేదో వారికే తెలియాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :