ఇంకో రెండు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేత

Published on Mar 13, 2020 11:05 pm IST

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తి పెరగకుండా చర్యలు మొదలుపెట్టాయి. చర్యల్లో భాగంగా జన సమూహం ఎక్కువగా ఉండే సినిమా థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నాయి. ఇప్పటికే పాజిటివ్ వైరస్ కేసులు నమోదైన కేరళ, జమ్మూ కాశ్మీర్, ఒడిస్సా, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సినిమా హాళ్ళను కొన్నిరోజులపాటు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాయి.

తాజాగా దేశంలోనే మొదటి కరోనా మృతి నమోదైన కర్ణాటకలో రేపటి నుండి వారం రోజుల వరకు థియేటర్లు మూసివేస్తూ ముఖ్యమంత్రి ప్రకటన చేయగా కొద్దిసేపటి క్రితమే బీహార్ ప్రభుత్వం సైతం మార్చ్ 31వరకు థియేటర్లు మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని నెల్లూరులో ఇప్పటికే థియేటర్లు మూసివేశారు. ఇంకొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పబ్లిక్ ఈవెంట్లతో పాటు థియేటర్లు మూసివేసే ఆలోచనలో ఉన్నాయి. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా పలు భాషల్లో కొత్త చిత్రాల విడుదలలు వాయిదాపడుతున్నాయి.

సంబంధిత సమాచారం :

More