“వీరమల్లు” నుంచి మరో అప్డేట్ రానుందా.?

Published on Aug 25, 2021 5:00 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. భారీ బడ్జెట్ తో పవన్ నుంచి వస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. పైగా దర్శకుడు క్రిష్ కావడంతో దీనిపై ఎనలేని అంచనాలు కూడా నెలకొన్నాయి.

మరి ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మంచి ఎగ్జైటెడ్ అప్డేట్స్ ని ఇచ్చిన మేకర్స్ నుంచి రానున్న కొన్ని రోజుల్లో మరో స్పెషల్ అప్డేట్ రానున్నట్టుగా తెలుస్తుంది. వచ్చే సెప్టెంబర్ 2 న పవన్ బర్త్ డే కానుకగా ఒక అదిరే పోస్టర్ ను లాంచ్ చెయ్యనున్నట్టుగా తెలుస్తుంది.

అలాగే ఈ చిత్రం తాలూకా సరికొత్త రిలీజ్ డేట్ ని కూడా అందులో పొందుపరిచే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :