టాలీవుడ్ లో మరో దర్శకునికి కరోనా పాజిటివ్.!

Published on Aug 13, 2020 11:40 am IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మూలాన ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా దీని ప్రభావం మన సినీ పరిశ్రమకు కూడా గట్టిగా బాలీవుడ్ లోని ఎందరో స్టార్ హీరోలు సహా మన టాలీవుడ్ లో స్టార్ దర్శకులు వరకు వచ్చేసింది. అలా ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళికి కరోనా పాజిటివ్ వచ్చిన వార్త ఎంత కలకలం రేపిందో అందరికీ తెలిసిందే.

కానీ గత రెండు వారాల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవడం మూలాన కరోనా బారి నుంచి తప్పించుకున్నానని రాజమౌళి తెలిపారు. ఇప్పుడు ఇదిలా ఉండగా మరో కొత్త ఫిల్మ్ మేకర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. తన మొదటి సినిమా “ఆర్ ఎక్స్ 100” చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తానే తెలిపారు. దీనితో దర్శకుడు ఒక ఆసక్తికర ట్వీట్ ను కూడా పెట్టారు. “వచ్చేసింది” అని ఒక ట్వీట్ “త్వరలో వస్తా ప్లాస్మా ఇస్తా” అని మరో ట్వీట్ చేసారు. దీనితో అతని ఫాలోవర్స్ ధైర్యం చెప్తున్నారు.

సంబంధిత సమాచారం :

More