నాలుగు సినిమాల కృష్ణా జిల్లా సెకెండ్ డే కలెక్షన్స్ !

Published on Dec 23, 2018 10:45 am IST

గత శుక్రవారం తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడి మరి విడుదల అయ్యాయి. వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ చిత్రం స్పేస్ నేపథ్యంలో తెరకెక్కడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ, ఆ అంచనాలను ఈ చిత్రం అందుకోలేకపోయింది. ఇక శర్వానంద్ పడి పడి లేచె మనసు కూడా ఫస్ట్ హాఫ్ బాగుందనిపించుకున్న.. సెకండ్ హాఫ్ పెద్దగా బాగాలేదనే టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేని పరిస్థితి.

అలాగే మూడో చిత్రంగా వచ్చిన మారి 2 పర్వాలేదనిపించినా.. సరైన ప్రమోషన్స్ లేకపోవడం.. ఒక పక్క మూడు సినిమాలు పోటీగా ఉండటం కారణంగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేని పరిస్థితి. ఇక కన్నడ సినిమా కేజీఎఫ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

కాగా కృష్ణా జిల్లాలో ఈ చిత్రాల సెకెండ్ డే షేర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

అంతరిక్షం కృష్ణా జిల్లాలో సెకెండ్ డే షేర్ 6.29 లక్షలు – మొత్తం షేర్ 13.43 లక్షలు.

పడి పడి లేచె మనసు కృష్ణా జిల్లాలో సెకెండ్ డే షేర్ 5.84 లక్షలు – మొత్తం షేర్ 16.15 లక్షలు.

మారి 2 కృష్ణా జిల్లాలో సెకెండ్ డే షేర్ 1,37,076 – మొత్తం షేర్ 3,46,712.

కెజిఎఫ్ చిత్రం కృష్ణా జిల్లాలో సెకెండ్ డే షేర్ 5,46,189. – మొత్తం 10,89,515
అలాగే గుంటూరు జిల్లాలో సెకెండ్ డే షేర్ 4,55,432 – మొత్తం 1044336

సంబంధిత సమాచారం :